‘మహర్షి’ని మస్త్‌ గా గెలికేస్తున్నారట!   Fans Over Expectations On Mahesh Babu Maharshi Movie     2018-10-29   12:52:39  IST  Ramesh P

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుతున్నారు. చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు వంశీ పైడిపల్లి పనులు చేస్తున్నాడు. అయితే సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో ప్రస్తుతం వంశీ పైడిపల్లిని నిర్మాత దిల్‌రాజు మరియు హీరో మహేష్‌ బాబు ఒత్తిడి చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి’ చిత్రంలో పెద్దగా యాక్షన్‌ సీన్స్‌ ఉండవట. కథానుసారంగా ఒకటి రెండు చిన్న ఫైట్స్‌ మాత్రమే ఉంటాయట. మహేష్‌బాబు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ వద్దని మొదటే దర్శకుడికి చెప్పడంతో వంశీ ఆ విధంగా స్క్రీన్‌ప్లేను డిజైన్‌ చేసుకున్నాడట. కాని ఇప్పుడు నిర్మాత దిల్‌రాజు మాస్‌ ఆడియన్స్‌ను అరించాలంటే సినిమాలో ఫైట్స్‌ ఉండాలి. మాంచి మాస్‌ మసాలా ఫైట్స్‌ రెండు ఉంటే తప్ప సినిమాను మాస్‌ ఆడియన్స్‌ అరించరు, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కూడా భారీగా అమ్ముడు పోవాలంటే యాక్షన్‌ సీన్స్‌ ఉండాలని దిల్‌ రాజు అంటూ చెప్పుకొస్తున్నారు.

‘మహర్షి’లో రెండు ఫైట్స్‌ను పెట్టాల్సిందే అంటూ దిల్‌రాజు చెబుతూ ఉండగా, మహేష్‌ బాబు మాత్రం ఫైట్స్‌ వద్దని నిర్మాత మాట పట్టించుకోవద్దని వంశీ పైడిపల్లితో అంటున్నాడట. మరో ఇద్దరు నిర్మాతలు అశ్వినీదత్‌ మరియు పీవీపీ ప్రసాద్‌లు మాత్రం దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చారు. కాని దిల్‌రాజు మాత్రం తన ఇన్వాల్వ్‌మెంట్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

Fans Over Expectations On Mahesh Babu Maharshi Movie-

ముందుగా అనుకున్న ప్రకారం స్క్రీన్‌ప్లేను సాగనివ్వక పోతే పెద్ద ఎత్తున నష్టం చేకూరే అవకాశం ఉందని, అనవసరంగా గెలకవద్దని దిల్‌రాజుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సలహా ఇస్తున్నారు. కాని దిల్‌రాజు మాత్రం తాను అనుకున్నట్లుగానే సాగాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.