మార్ఫింగ్ ఫొటోతో అల్లు అర్జున్ పై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన ఫ్యాన్స్!

సోషల్ మీడియా ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ లు బాగా పెరిగి పోతున్నాయి.అవి నిజమో కాదో తెలుసుకునే లోపే ప్రజలకు చేరిపోతున్నాయి.

 Fake Photoshopped Picture Of Allu Arjun's Is Going Viral , Pushpa The Rule, Push-TeluguStop.com

దీంతో కొన్ని విషయాలు ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తాయి.ఇక సినీ ఇండస్ట్రీలో ఫేమస్ సెలెబ్రిటీలపై( famous celebrities ) ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.

మరి మన స్టార్ హీరోలపై కూడా అప్పుడప్పుడు రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.

గతంలో ప్రభాస్ ఆదిపురుష్( Prabhas, Adipurush ) చేస్తున్న సమయంలో ఒక లుక్ ను మార్ఫింగ్ చేసి ఎలా వైరల్ గా మార్చారో ఇప్పుడు కూడా ఇదే తరహాలో అల్లు అర్జున్( Allu Arjun ) పిక్ ఒకటి మార్ఫింగ్ చేసారు.

అల్లు అర్జున్ ను గడ్డం లేకుండా ఒక పిక్ ను మార్ఫ్ చేసి వైరల్ చేసారు.ఇది ఇక్కడ కంటే నార్త్ ఆడియెన్స్ ( North Audience )లో ఎక్కువుగా వైరల్ అవుతుంది.

ఈ పిక్ ఫ్యాన్స్ వద్దకు కూడా చేరిపోయింది.

దీంతో ఇది ఒరిజినల్ కాదని.మార్ఫింగ్ అని నిరూపిస్తూ ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు.ఏది ఏమైనా ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటివి ఇప్పుడు కామన్ అయిపోయాయి.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం ”పుష్ప ది రూల్”( Pushpa the Rule ) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.పుష్ప పార్ట్ 1 ఘన విజయం తర్వాత పార్ట్ 2 ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈసారి సుకుమార్ అగ్ర కాస్టింగ్ ను యాడ్ చేసుకుంటూ ఈ సినిమా హైప్ మరింత పెంచుతున్నాడు.చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube