అరటి పండు ఎప్పుడూ ఎందుకు వంగిపోయి ఉంటుందో తెలిస్తే..

అరటి కాయ‌ చెట్టుపై ఉన్న‌ప్పుడు అది గుత్తులుగా ఉంటుంది.దీనిని అర‌టి గెల అని అంటారు.

 Facts About Banana, Banana, Facts, Economics Of Chanakya-TeluguStop.com

ప్రారంభంలో అరటి నేల వైపు పెరుగుతుంది.దీనిని నెగెటివ్ జియోట్రోపిజం అంటారు.

అంటే సూర్యుని వైపు పెరిగే చెట్లు.ఈ ధోరణి కారణంగా అరటికాయ‌లు తరువాత పైకి పెర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

దీని కారణంగా అరటిపండు వంకరగా మారుతుంది.సన్‌ఫ్లవర్ కూడా ఇదే విధమైన మొక్క.

ఇది ప్రతికూల జియోట్రోపిజమ్‌కు ధోరణిని కలిగి ఉంటుంది.పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుడు ఉదయించే దిశలో ఉంటుంది.

సాయంత్రం సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు, పొద్దుతిరుగుడు పువ్వు కూడా తన దిశను మారుస్తుంది.అందుకే ఈ పువ్వుకు సన్‌ఫ్లవర్ అని పేరు.

అరటి వృక్షశాస్త్ర చరిత్ర ప్రకారం అరటి చెట్లు మొదట వర్షారణ్యం మధ్యలో పుట్టాయి.అక్కడ సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది.

అందువల్ల అరటి పెరగడానికి వాటి చెట్లు అదే వాతావరణానికి అనుగుణంగా తమను తాము మలచుకున్నాయి.అలా సూర్యరశ్మి వచ్చినప్పుడల్లా అరటిగెల‌లు సూర్యుని వైపు కదలడం ప్రారంభించాయి.

అందుచేత అరటిగెల‌ ముందుగా నేలవైపు, ఆ తర్వాత ఆకాశం వైపు పెరగడంతో పరిమాణం వంకరగా మారుతుంది అరటి చెట్టు అరటి పండును మతపరమైన దృక్కోణం నుండి చాలా పవిత్రమైన వాటిగా పరిగణిస్తారు.చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా అరటి చెట్టు ప్రస్తావన ఉంది.

అజంతా-ఎల్లోరా కళాఖండాలలో అరటిపండ్ల చిత్రాలు కనిపిస్తాయి.దీని ప్ర‌కారం చూస్తే అర‌టికి ఉన్న‌ చరిత్ర చాలా పురాతనమైనది.

అరటిపండు 4000 సంవత్సరాల క్రితం మలేషియాలో మొట్టమొదట పుట్టి, ప్రపంచమంతటా పాకింద‌ని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube