బీసీ లోన్ల దరఖాస్తులకు గడువు పెంచండి

నల్గొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బీసీ లోన్ల దరఖాస్తుల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు తహశీల్దార్ కార్యాలయాల్లో అక్రమ వసూళ్ల దందాకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దరఖాస్తు చేసుకునే గడువు తక్కువగా ఉండడంతో కుల,ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వచ్చే పేదల నుంచి రెవెన్యూ సిబ్బంది, కొందరు దళారీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.

300 నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.డబ్బులు ఇచ్చిన వారికి వెంటనే కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలను మంజూరు చేస్తూ,డబ్బులు ఇవ్వని దరఖాస్తుదారులకు సర్టిఫికేట్లను జారీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీనితో అనేక మంది పేదలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారని సమాచారం.

అక్రమ వసూళ్లు కూడా నగదు రూపంలో కాకుండా పోన్ పే,గూగుల్ పే ద్వారా దండుకుంటున్నట్లు వినికిడి.కనగల్,నల్గొండ మండల తహసిల్దార్ కార్యాలయాల్లో దీనికి సంబంధించి దందా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతుందని,ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ పే స్క్రీన్ షాట్ కూడా బయటికి వచ్చినట్లు తెలుస్తుంది.

Extend Deadline For BC Loan Applications, BC Loan Applications, Nalgonda Distri

దీనితో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ లోన్ల దరఖాస్తుకు ప్రభుత్వం మరింత గడువు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత
Advertisement

Latest Nalgonda News