నల్లగొండ జిల్లా:సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్విరామంగా కొనసాగుతుంది.ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ మండలం జి.
చెన్నారం గ్రామంలో బస చేసింది.శనివారం విరామ సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ ( cm kcr )పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా? అనే అంశంపై తెలంగాణ ఉద్యమం( Telangana movement )లో పాల్గొన్న ఉద్యమకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో చర్చించారు.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడానికి అవసరమైన చర్యలు ఏమిటని అందరి అభిప్రాయాలుస్వీకరించారు.సమావేశం అనంతరం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు,తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్అందజేయాలని,ప్రస్తుత రాజకీయాలలో న్యాయవాదులు, మేధావులను క్రియాశీలకంగా పాల్గొనే విధంగా రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలని,ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సమావేశంలో నల్లగొండ డీసీసీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎం.వి.గోనారెడ్డి,న్యాయవాది, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ముక్కెర శ్రీనివాస్,నాంపల్లి నరసింహ,చింతగిరి చైతన్య,నాంపల్లి భాగ్య, మామిడి బాలయ్య తదితర న్యాయవాదులు మరియు సీనియర్ జర్నలిస్ట్ ఏడుకొండలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.