ఇటీవల కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే హడావుడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.షర్మిల ద్వారా పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుని, వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ అధిష్టానం ఉంది.
అందుకే తెలంగాణ రాజకీయాల్లో మొన్నటి వరకు ఉన్న షర్మిలను తమ పార్టీలో చేర్చుకుని ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రభావం కనిపిస్తుందని ,ప్రస్తుతం వైసీపీలోని( YCP ) అసంతృప్త నాయకులంతా షర్మిల ద్వారా కాంగ్రెస్ lo చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది.
అయితే షర్మిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దు అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్( MP GV Harsha Kumar ) కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు.

మొన్నటివరకు తెలంగాణ బిడ్డని అని చెప్పుకున్న షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీకి జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని హర్ష కుమార్ చెబుతున్నారు .జగన్ షర్మిల ఒక్కటేనని ,కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్ గా ఉండేందుకే చెరో చోటు ఎంచుకున్నట్లు హర్ష కుమార్ అనుమానం వ్యక్తం చేశారు.షర్మిలకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే బదులు, జాతీయస్థాయి పదవి ఇవ్వాలని హర్ష కుమార్ సూచిస్తున్నారు.
ఏఐసిసి పదవి ఇచ్చి స్టార్ క్యాంపైనర్ గా ఆమె సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని సూచిస్తున్నారు.

దీంతో షర్మిల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రద్దరాజు( Gidugu Raddaraja ) మాత్రం పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటానంటూ చెబుతున్నారు.