దొడ్డి కొమరయ్య నేటి తరానికి ఓ ఐకాన్

యాదాద్రి భువనగిరి జిల్లా:భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని కురుమ సంఘం జిల్లా అద్యక్ష కార్యదర్శులు గవ్వల నరసింహులు,కాదూరి అచ్చయ్య పేర్కొన్నారు.

ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్ధూపం వద్ద జరిగిన దొడ్డి కొమరయ్య 95 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లడాతూ దొడ్డి కొమరయ్య జీవిత ఆశయాలను భవిష్యత్ తరానికి అందించాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉందన్నారు.దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని,జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Doddi Komarayya Is An Icon For Today's Generation-దొడ్డి కొ�

జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ పాలక వర్గం సహకరించాలని కోరారు.ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భువనగిరి జిల్లా ప్రాదేశిక సభ్యులు సుబ్బురు బీరుమల్లయ్య,కురుమ సంఘం జిల్లా నాయకులు పేరపు రాములు,జాన సత్యనారాయణ, జూకంటి వీరేశం,కవిడె మహేంధర్,మోటె సత్యనారాయణ,ఎగ్గిడి శ్రీ శైలం,బండ సురేష్,జోగిని రామకృష్ణ,మోటె చిన సత్యనారాయణ,కంచి మల్లయ్య,ఓరుగంటి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

*యాదవ హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో* తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు జాతీయ యాదవ హక్కుల సమితి జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్,పోతుల వెంకటేష్ యాదవ్,గుండెబోయిన సురేష్ యాదవ్,కొడారి వెంకటేష్ యాదవ్, సాబన్కార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల

Latest Nalgonda News