ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిపోయారు.ఇలా ఈ హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిపోవడంతో వీరి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే పెరిగిపోయింది.
ఒకప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరోలు ఇప్పుడు వందల కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్ హీరోలో మొదటి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు అనే విషయానికి వస్తే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ఈయన హీరోగా అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.1996లో వచ్చిన ఈసినిమాకు ఆయన 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇక ఈయన హీరోగా మొదట నటించిన సినిమా కోసం పది లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తో గ్లోబలర్ ఇమేజ్ ను మూటగట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ( Ntr ) టాలీవుడ్ ఇండస్ట్రీలో బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు.ఇక ఈయన హీరోగా నటించిన నిన్ను చూడాలని కోసం 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడట.ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) .ఇక ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.అయితే ఈయన ఫస్ట్ మూవీ ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
అల్లు అర్జున్ ( Allu Arjun )గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఇక ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇక గంగోత్రి సినిమా కోసం ఈయన కేవలం 20 లక్షలు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్(Ramcharan ) చిరుత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రస్తుతం ఈయన గ్లోబల్ స్టార్ అనే ఇమేజెస్ సొంతం చేసుకుని ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.అయితే ఈయన మొదటి సినిమా చిరుత కోసం ఏకంగా 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.