త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరి ని తలచుకోగానే మనకు కనిపించేటట్టు వంటి రూపం శేష తల్పం మీద స్వామి వారు శయనించి ఉండగా స్వామివారి పాదాల చెంత లక్ష్మీదేవి కొలువై ఉండడం మనకు కనబడుతుంది.అనేక దేవాలయాలలో ఇటువంటి విగ్రహాలే మనకు దర్శనమిస్తాయి.
కానీ స్వామివారు శయనించి ఉండే అన్ని విగ్రహాలు ఒకే విధంగా ఉండవు.మరి స్వామివారు శయనించే విగ్రహాలు ఎన్ని రకాలు అవి ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సృష్టి శయనం:
విష్ణుదేవుడు తొమ్మిది తలలు గల శేష పానుపు పై శ్రీహరీ, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో ఎర్రని పాదాలతో శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు.అదేవిధంగా లక్ష్మీ దేవి, భూదేవి, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనం అవుతుంది.
యోగా శయనం
: శ్రీ మహావిష్ణువు ఎర్ర తామర రేకులవంటి నేత్రాలతో యోగనిద్రా సుఖములో వుంటుంది.2 భుజాలు కలిగి, ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్థశయనంలో ఉంటుంది.ఐదు తలలు కలిగిన శేషుడు శంఖంలా, చంద్రునిలా తెల్లగా ఉంటుంది. ఈ విధంగా విష్ణు దేవుడికి కుడివైపున మార్కండేయుడు ఎడమవైపున భూదేవి ఉండటమే కాకుండా బ్రహ్మదేవుడు పంచాయుధాలు నమస్కరిస్తున్నట్టు మనకు దర్శనమిస్తాడు.
భోగ శయనం :
భోగశయన రూపంలో ఉన్న మహావిష్ణువు సకల పరివారం తో కలిపి ఏడు తలలు కలిగిన శేషాచలం పై కొలువై ఉంటారు.ఈ విధంగా భోగ శయనం పై ఉన్న విష్ణుమూర్తి అష్ట ఆయుధాలను కలిగి ఉండి, ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడితో కొలువై ఉంటాడు.స్వామివారికి కుడిచేతి పక్కన లక్ష్మీదేవి కుడికాలి పక్కన సరస్వతి దేవి కొలువై ఉంటారు.అదే విధంగా ఎడమ పాదం పక్కన భూదేవి కొలువై ఉంటుంది.
సంహార శయనం:
ఈ శయనం పై శ్రీవారు రెండు పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్రలో, మూసిన కన్నులతో, తామస భావాన్ని కలిగి ఉంటాడు.నల్లని రూపంతో కొలువై ఉంటాడు.
ఈ రూపం స్వామి వారి కొంత రౌద్రంగా కనిపిస్తుంది.