అత్రి మహర్షి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహాముని చాలా కోపిష్టి. ఇతను చెప్పిన వెంటనే ఎవరు చేయకపోయినా వెంటనే శపించే వాడు.
అందు వల్లే అతను ఎక్కడికి వెళ్లినా అందరూ జాగ్రత్తగా ఉండేవారు, ఆయన అడిగిన వెంటనే పనులు చేసేవారు. కుంతీ దేవి చిన్నప్పుడు దుర్వాస మహామునిని చాలా చక్కగా చూస్కుందంట.
అందుకు మెచ్చిన ఆయన ఆమెకు నీవు మంత్రం జపించి. ఇష్టమైన దేవుడిని కోరుకుంటే ఆయన అంశ వల్ల నీకు కుమారులు కల్గుతారనే వరం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా. ఎన్నో మంత్రాలు ఉపాసన చేసినా దుర్వాస మహాముని తృప్తి చెందలేడట. చివరగా ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఉపాసన చేస్తాడు. పద్దెనిమిది భుజాలతో ఉన్న స్వరూపంతో స్వామిని ధ్యానిస్తూ చేసిన తపస్సు ఫలితంగా… వెంటనే ఆంజనేయ స్వామి అదే రూపంలో దుర్వాస మహా మునికి దర్శనమిచ్చాడట.
దుర్వాస మహర్షి కోసం హనుమంతుడు ఎత్తిన అవతారమే అష్టాదశ భుజాంజనేయ స్వామి అవతారం. ఈ కథ చాలా మందికి తెలియదు.
కానీ ఈ స్వామి అవతారాన్ని గుర్తు చేసుకొని ఏమైనా కోరుకుంటే ఆ స్వామి వారు వెంటనే కరుణిస్తారట. మనం ఏ విషయంలోనైనా ఈ పని నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఈ అష్టాదశ అభయాంజనేయ స్వామి వారిని గుర్తు చేసుకుంటే మనకు ఎక్కడ లేని బలం వస్తుందట.
ఈ పనిని ఎంతో సులువుగా చేసెయొచ్చట. అందుకే మీరు ఏ పనినైనా చేయలేకపోతున్నాని అనుపిస్తే.
ఈ స్వామి వారిని స్తుతించండి.