బిజెపి( BJP ) తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Minister Kishan Reddy ) మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది .ఈరోజు ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి మండలి సమావేశం ప్రారంభం అయింది.
అయితే ఈ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాకపోవడం, ఆయన ఢిల్లీలోనే( Delhi ) ఉన్నా, ఈ సమావేశానికి దూరంగా ఉండడం ,అలాగే మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళకపోవడంతో, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియమిస్తూ బిజెపి అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసినా, కిషన్ రెడ్డి స్పందించలేదు.
దీంతో కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి( BJP President ) అసంతృప్తితో ఉన్నారని , ఆ పదవిని తీసుకునేందుకు ఆయన ఆసక్తి చూపించకపోయినా, బిజెపి అధిష్టానం పెద్దల ఒత్తిడి తో ఒప్పుకున్నారని, ఆ ఆసంతృప్తితోనే కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.అయితే కిషన్ రెడ్డి బిజెపి అధ్యక్ష పదవి పై అసంతృప్తితో ఉండడం, ఇప్పుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నా, ఆయన మాత్రం దీనిపై స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు.దీంతో కిషన్ రెడ్డి ఈ వ్యవహారాల పై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ వ్యవహారం తెలంగాణ బిజెపిలోను కలకలం రేపుతోంది.ఇప్పటికే తెలంగాణ బిజెపిలో గందర గోళం నెలకొనడం, పార్టీని ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ఇప్పుడిప్పుడే చర్యలు మొదలు పెట్టడం , అసంతృప్తితో ఉన్న ఈటెల రాజేందర్( Etela Rajender ) కు బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం వంటివి చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం కిషన్ రెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.