బ్యాంక్ అధికారుల వత్తిడితో వికలాంగ రైతు ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా:కనగల్ మండలం జి.

యడవల్లి గ్రామానికి చెందిన వికలాంగ రైతు గౌని వెంకన్న (48) కోపరేటివ్ బ్యాంకు అధికారుల బెదిరింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.15 రోజుల క్రితం కోపరేటివ్ బ్యాంకు అధికారులు లోను డబ్బులు రూ.1,60,000 కట్టమని వత్తిడి చేస్తూ తనకున్న భూమిలో జెండాలు పాతి వెళ్లారు.మళ్లీ సోమవారం వచ్చి గ్రామంలో డబ్బు చాటింపు వేయిస్తామని బెదిరించారు.

దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన తాను చేసేదేమీ లేక సోమవారం సాయంత్రం మూడు గంటలకు వరి చేనుకు కొట్టే మందు తాగానని,తాను ఇక బ్రతకనని కన్నీటి పర్యంతమయ్యారు.ప్రస్తుతం బాధిత రైతు నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Disabled Farmer Attempts Death Due To Pressure From Bank Officials, Disabled Far

ఈ ఘటన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో జరగడం గమనార్హం.

స్టాండ్స్ లో చిన్నపిల్లలా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
Advertisement

Latest Nalgonda News