జీహెచ్ఎంసీలో పాలన వికేంద్రీకరణ..!!

జీహెచ్ఎంసీ పరిధిలో పాలన కొత్త రూపు దాల్చనుంది.పాలన వికేంద్రీకరణలో భాగంగా వార్డు పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది.

 Decentralization Of Governance In Ghmc..!!-TeluguStop.com

ఈ విధానం నగరంలో మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.దీంతో పాలన ప్రజలకు మరింత చేరువ కానుంది.ఈ నేపథ్యంలో వార్డు ఆఫీసర్ల నియామకంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది.150 డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంఛార్జ్ గా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించనున్నారు.దీంతో సర్కిల్స్ 30 నుంచి 48 కి పెరగనుండగా.జోన్ల సంఖ్య ఆరు నుంచి పన్నెండుకి పెరగనుంది.ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube