మహిళా బిల్లు( Women Reservation Bill ) అన్నది పక్తు ఎన్నికల నినాదంగా మారిపోయి దశాబ్దాలు దాటింది.ఆకాశంలో సగం అని చెప్పుకునే స్త్రీ మూర్తికి కనీసం మూడో వంతు ప్రాముఖ్యత ఇవ్వడానికి కూడా బారత ప్రజాస్వామ్యానికి 76 సంవత్సరాలు పట్టింది .
దేశాన్ని నడిపించే చట్టాలు చేసే చోట స్త్రీల ప్రదాన్యత ఇంత తక్కువ స్తాయిలో ఉండడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అనేకమంది మేదావులు సెలవిచ్చారు.అనేక మంది ఉద్యమ కారులు దశాబ్దాల పాటు పోరాటం చేశారు చాలాసార్లు ఈ నినాదం రాజకీయ పార్టీలకు కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే మిగిలిపోయింది కొన్ని ప్రభుత్వాలు నామ మాత్రం ప్రయత్నాలు చేసినప్పటికీ వాటికి ఆ బిల్లు పట్ల చిత్తశుద్ధి లేదని అనేకసార్లు రుజువయింది.
అయితే ఇంత కాలానికి సుస్థిర ప్రభుత్వం ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో భాజపా ప్రభుత్వం చేసి చూపించినట్లు అయింది.
తాము అదికారం లోకి వచ్చినప్పటి నుంచి సున్నితమైన అంశాల పట్ల కూడా దూకుడుగా ముందుకు వెళుతున్న భాజపా( BJP ) మహిళా బిల్లును కూడా అదే తరహా లో ముందుకు తీసుకువచ్చింది.దీని వెనుక అనేక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ,ఇంతకాలం ఈ బిల్లు ఎందుకు తీసుకు రాలేదని అనేక విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించినప్పటికీ దశాబ్దాల కల సాకారమైన వేళ ఆ విమర్శలు పెద్దగా ప్రభావం చూపించడం లేదు.అయితే పార్లమెంట్ చరిత్రలో అత్యంత భారీ మెజారిటీతో పాసైన బిల్లుగా కూడా ఇది రికార్డు సృష్టించినట్లుగా తెలుస్తుంది.
ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటు లో మాట్లాడిన హోమ్ మంత్రి అమిత్ షా మోడీ ప్రభుత్వానికి మహిళల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనం అని చెప్పుకొచ్చారు.
ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని, ఓబిసి కోటా వర్తింపచేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయనిఅయితే 2024 ఎన్నికల తర్వాత డి లిమిటేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే దీని పైన నియమించిన కమిటీ ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు . రాహుల్( Rahul gandhi ) ని ఉద్దేశించి మాట్లాడుతూ మూడంతుల సీట్లు వెంటనే రిజర్వ్ చేయాలని పట్టుబడుతున్నారని, మేము నిబంధన ప్రకారం ముందుకు వెళ్లి వాయనాడ్ సీటు రిజర్వ్ చేయాల్సి వస్తే మళ్లీ మీరే రాజకీయాలు చేస్తున్నామని నిందిస్తారని అందువల్ల పూర్తిస్థాయి విధి విధానాలతో 2024 ఎన్నికల తర్వాత దీన్ని అమలు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మహిళా బిల్లు చారిత్రక ఘట్టమని అభివర్ణించి ఆయన బిల్లు రూపకల్పనలో కూడా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు
.