'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ ఫైనల్.. ఎక్కడంటే?

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు.ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.

 Date And Venue Locked For Tiger Nageswara Rao Pre-release Event, , Ravi Teja, N-TeluguStop.com

ఇప్పుడు మరో సినిమాతో దసరా బరిలో నిలిచేందుకు సిద్ధం అయ్యాడు.ఈ సీజన్ లో భారీ పోటీ ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు.

ప్రస్తుతం రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టు కోవడంతో ఈ సినిమాకు అంచనాలు బాగానే పెరిగాయి.

మాస్ రాజా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) బయోపిక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఫిక్స్ అయ్యారు.ఈ క్రమంలోనే డేట్ అండ్ వెన్యూ ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 15న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని శిల్పాకళా వేసికలో గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నిర్మించారు.

అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.చూడాలి మరి పోటీ మధ్య ఎలాంటి హిట్ సాధిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube