రెండు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ దాటేసిన 'దసరా'.. నాని దూకుడు తగ్గడం లేదుగా!

నాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా”( Dasara ).శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.

 Dasara Box Office Collection Day 2, Dasara Box Office Collections, Dasara Collec-TeluguStop.com

ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే వచ్చిన రెస్పాన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే.ముందు నుండి నాని కాన్ఫిడెంట్.

టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ సినిమా రిలీజ్ గ్రాండ్ కు సహాయ పడ్డాయి.అలాగే ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఇక కలెక్షన్స్ లో నాని దూకుడు ఎవ్వరూ తగ్గించలేక పోతున్నారు.

ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది.అంతేకాదు ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా 50 కోట్లు క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.దీంతో టైర్ 2 హీరోల్లో నాని సంచలన రికార్డ్ క్రియేట్ చేసాడు.రెండు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అందరిని షాక్ కు గురి చేస్తుంది.

మేకర్స్ ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 53 కోట్ల మాసివ్ మార్క్ ను ( Dasara Collections ) రెండు రోజుల్లోనే దాటేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.నాని కెరీర్ లోనే ఇది ఫాస్టెస్ట్ 50 కోట్ల గ్రాసర్.ఇక ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 100 కోట్ల మార్క్ చేరుకోవడం దసరా సినిమాకు కష్టమేమి కాదు.

చూడాలి ఈ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube