కాంగ్రెస్ లో చేరిన సిపిఎం నేత...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన సిపిఎం నాయకుడు,మాజీ మండల కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్ కు గురువారం సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు తన నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో జానారెడ్డి చేసిన అభివృద్ది మాత్రమే ఈ ప్రాంతంలో కంటికి కనపడుతుందని,గడిచిన 10 ఏండ్లుగా కుంటుపడిన అభివృద్ది తిరిగి ఎమ్మెల్యే జైవీర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు.ఆ నమ్మకంతో అభివృద్ధిలో భాగస్వామినై జైవీర్ రెడ్డి నాయకత్వాన పనిచేయాలనే సంకల్పంతో ప్రజలకు మరింత సేవచేయడానికి కాంగ్రెస్స్ పార్టీ వేదికగా ముందుకు వెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి (సాగర్) మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలసాని చంద్రశేఖర్, రాజవరం ఎంపీటీసీ నెమలి శ్రీధర్ రెడ్డి,మాజీ సర్పంచ్ కొర్ర భీమ్లా నాయక్,కాంగ్రెస్ నాయకులు కాశిమల్ల చిట్టి, కుర్ర నాగ నాయక్ తదితరులు ఉన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

Latest Nalgonda News