మన దేశంలో అందిన కాడికి దోచుకుందామనుకునే కాంట్రాక్టర్ల సంఖ్య భారీగానే ఉంది.నిబంధనలు పక్కన పెట్టి, నీతి న్యాయం అనే పదాలు మరిపోయి పనులు చేస్తుంటారు.
ఇక రోడ్లు నిర్మాణం చేస్తే, పట్టుమని పది రోజులు కాకుండానే అవి గుంతలు పడతాయి.ఇటువంటి సంఘటనలు నిత్యం కోకొల్లలు.
ఇదే కోవలో ఆసుపత్రికి ఆహారంతో పాటు ఇతర వస్తువులు సప్లయి చేసే ఓ కాంట్రాక్టర్ కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు.తప్పుడు బిల్లులు సమర్పించి, కోట్లు నొక్కేద్దామనుకున్నాడు.ఓ బిర్యానీకి ఏకంగా రూ.3 లక్షల బిల్లు పెట్టడంతో ఓ అధికారికి అనుమానం వచ్చింది.ఆరా తీయడంతో…
ఏ రెస్టారెంట్‌లో బిర్యానీ ధర ఎంత ఉంటుంది.మహా అయితే రూ.300ల వరకు ఉంటుంది.కానీ ఓ వ్యక్తి ఒక్కో బిర్యానీకి రూ.3 లక్షలు బిల్లు పెట్టాడు.దీంతో బిర్యానీ అంత ధర ఎందుకు వచ్చిందని అధికారులు సైతం అవాక్కయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.సౌవిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆయన ముందుకు కొన్ని దస్త్రాలు వచ్చాయి.వాటిని పరిశీలించిన ఆయన కంగుతిన్నారు.బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ కాంట్రాక్టర్ బిల్లు వేశాడు.కింగ్‌షూక్ అనే కాంట్రాక్టర్ ఆసుపత్రికి వివిధ రకాల వస్తువులను సరఫరా చేస్తాడు.ఇందులో భాగంగా ఫర్నీచర్, ఫార్మసీ, వాహనాల ఖర్చులతోపాటు పలు బిల్లుల కోసం సుమారు రూ.3 కోట్లకు బిల్లులు పెట్టాడు.వాటిపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు.
దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 81 రకాల దొంగ బిల్లులు బయటపడ్డాయి.ఇక బిర్యానీ వ్యవహారంపై అధికారులు మరింత కూలంకషంగా వివరాలు సేకరించారు.
పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పెషల్ వెరిఫికేషన్ కమిటీ సమావేశం పెట్టి, వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.చివరికి అవి బోగస్ బిల్లులుగా తేల్చారు.
బిల్లుపై సంతకం చేసిన వైద్య సిబ్బంది పాత్రపైనా తాము విచారణ చేపడతామని, కాంట్రాక్టర్‌తో పాటు ఆయనకు సహకరించిన వారందరిపైనా చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.