జైవీర్ రెడ్డిపై నోముల భగత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు.

మంగళవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో మండల కేంద్రానికి ఒక కోటి నలభై మూడు లక్షలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ది అంటే కేవలం ఒక సంవత్సరకాలంలో తిరుమలగిరి మండలం కేంద్రం ముకుందాపురం వరకు 70 కోట్లు, అదేవిధంగా నెల్లికల్ నుంచి నడిగడ్డకు 90 కోట్లు,మరియు అటవీలో 5 రహదారులకు 12కోట్ల 70లక్షలతో అదేవిధంగా గిరిజనులకు పోడు భూములకు పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికే దక్కుతుందన్నారు.మీరు కేవలం 2 సం కాలంలో ఫంక్షన్ల పేరుతో పబ్బం గడిపి,సంక్షేమం మీద దృష్టి పెట్టని చరిత్ర మీదన్నారు.

ఎమ్మెల్యేపై మాట్లాడే హక్కు మీకు లేదనిన్నారు.ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు రిపీట్ అయితే భవిష్యత్ లో తగిన పరిణామాలు చూస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్, మండల నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి,మాజీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మేరావత్ మునినాయక్,యువజన కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి హరినాయక్, పగడాల సైదులు,శ్రీను నాయక్,వెంకటేశ్వర్లు, పాండు నాయక్,పిట్టల కృష్ణ,శ్రీరామ్,సుభాని, రాజు,గోపి,భిక్షం,సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
బీఆర్ఎస్,బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Latest Nalgonda News