ఏపీ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే.. సీఎం జగన్

వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు.

 Comprehensive Land Survey Across Ap.. Cm Jagan-TeluguStop.com

ఇందులో భాగంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించామని తెలిపారు.

ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి అయిందన్నారు.మొత్తం 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందించినట్లు సీఎం జగన్ వెల్లడించారు.

ఫిబ్రవరిలో రెండో దశలో నాలుగు వేల గ్రామాల్లో భూ సర్వే చేపడతామని వెల్లడించారు.మే 2023 నాటికి 6 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు.

అదేవిధంగా ఆగస్ట్ 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే జరుగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు.రాష్ట్రంలో అన్ని రకాల భూ వివాదాలకు చెక్ పెడతామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube