నాలుగు రోజుల పాటు తెలంగాణలో చల్లదనం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రజలకు వాతా వరణశాఖ( Department of Meteorology ) చల్లని కబురు చెప్పింది.

నేటి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి,మేడ్చల్‌,మల్కాజ్ గిరి,మంచిర్యాల,నిర్మల్‌, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి,జయశంకర్‌ భూపాలపల్లి,ములుగు, కామారెడ్డి,మెదక్‌ జిల్లాతో పాటు సంగారెడ్డి,ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నల్గొండ,వికారాబాద్‌,జోగులాంబ గద్వాల,వనపర్తి,నాగర్‌ కర్నూల్‌,నారాయణపేట జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది.మహారాష్ట్ర ( Maharashtra )నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!
Advertisement

Latest Nalgonda News