నేడు నల్లగొండ జిల్లాలో సిఎం పర్యటన...పటిష్ట బందోబస్తు ఏర్పాటు:ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో హెలిప్యాడ్,సభాప్రాంగణం,దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రదేశాలను ఎస్పీ భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్ట్,మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమంతో పాటు యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐజి, డిఐజి,ఐదుగురు ఎస్పీలు,10 మంది అడిషనల్ ఎస్పీలు,25 మంది డీఎస్పీలు,75 మంది సిఐలు,170 మంది ఎస్ఐలు, 2500 మంది సిబ్బందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

CM's Visit To Nalgonda District Today... Tight Security Arrangements: SP Sharat

Latest Nalgonda News