యాదాద్రి భువనగిరి జిల్లా:అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలవగా ఒకరు సురక్షితంగా బయటపడిన విషాద సంఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది.మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశీ(23),దిగ్నేశ్(21), హర్ష(21),బాలు(19),వినయ్(21)గా గుర్తించగా,ప్రమాదం నుంచి బయటపడ్డ మణికంఠ (21)గా గుర్తించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.







