మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.దాదాపు రూ.200 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అయినా కూడా ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం లేదంటూ చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా విడుదలకు కనీసం రెండు వారాలు కూడా లేకున్నా ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టక పోవడానికి కారణమేంటి.అసలు ఈ సినిమా దసరాకు విడుదల అవుతుందా లేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు.
ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాడు.అది కూడా ఏకంగా ఆకాశంలో ఒక జెట్ విమానంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశాడు.
శ్రీముఖి మరియు మెగాస్టార్ చిరంజీవి మధ్య సరదా సంభాషణలతో గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ప్రమోషన్ కార్యక్రమాలు జరగడం లేదు.ప్రారంభం అవ్వడం లేదు అంటూ నానా హంగామా చేసిన మెగా ఫ్యాన్స్ మరియు ఇతర సినీ ఫ్యాన్స్ ఇప్పుడు నోరెళ్ల బెట్టి చూస్తారేమో.ఈ సినిమాలో నయన తార కీలక పాత్ర లో నటించింది.
కనుక ఆమె తప్పకుండా ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తుందని కొందరు భావిస్తున్నారు.పెళ్లి తర్వాత ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు ఓకే చెబుతుందని చర్చ జరిగింది.
కానీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తుందని నమ్మకం కొందరి లో కనిపించడం లేదు.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ప్రస్తుతానికి నయనతార విషయంలో మౌనంగా ఉన్నారు.
ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే.శ్రీముఖి కి విమానంలో చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ ఇంటర్వ్యూ విడుదలైన తర్వాత కచ్చితంగా సినిమాకి మంచి క్రేజ్ హైప్ వచ్చే అవకాశం ఉంది.