టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా పరిచయమైన సినిమా చారి 111.స్పై కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ మరియు ప్రియ మాలిక్ ప్రధాన పాత్రలలో నటించారు.
టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అతిధి సోనీ నిర్మాతగా వ్యవహరించారు.మార్చి 1 న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
కథ :
రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్ టీం ను మేజర్ ప్రసాదరావు ( మురళీ శర్మ ) నడిపిస్తూ ఉంటారు.దేశ భద్రత కోసం ఈ టీమ్ వర్క్ చేస్తూ ఉంటుంది.అయితే హైదరాబాదులో జరిగిన ఒక బాంబ్ అటాక్ లో ఎలాంటి క్లూస్ దొరకకపోవటంతో ఈ కేసును రుద్రనేత్ర( Rudranetra ) టీం కి అప్పగిస్తారు.ఆ టీం కి నాయకత్వం వహిస్తాడు ఏజెంట్ చారి 111( Agent Chari 111 )( వెన్నెల కిషోర్ ).ఈ మిషన్ లో ఈషా( Isha ) ( సంయుక్త ) పాత్ర ఏమిటి? బ్లాస్టింగ్ లో ఉపయోగించిన కెమికల్ పిల్ ఏమిటి? చివరికి చారి తన మిషన్ కంప్లీట్ చేశాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి అనేది కధ.
నటీనటులు :
వెన్నెల కిషోర్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశాడు.తింగరి ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు.ఇక ఈషా గా సంయుక్త తన పాత్ర మేరకు బాగానే నటించింది.
ఇక మురళి శర్మ( Murali Sharma ) ఎప్పటిలాగే జీవించేసాడు.ఇక బ్రహ్మాజీ,సత్య, తాగుబోతు రమేష్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
ఇక విలన్ పాత్ర విషయానికి వస్తే పెద్దగా గుర్తుపెట్టుకునే విధంగా లేదనే చెప్పాలి.
విశ్లేషణ:
సీక్రెట్ ఏజెంట్ సినిమా అనగానే మనకి జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తొస్తాయి.అయితే ఇందులో కామెడీని పండించాలి అనుకోవడం మంచిదే కానీ ఎంతవరకు న్యాయం చేసాం అన్నది ఆలోచించుకోవాలి.ఎందుకంటే వెన్నెల కిషోర్( Vennela Kishore ) సినిమా లో ఎవరైనా కామెడీ ని ఎక్స్పర్ట్ చేస్తారు కానీ ఈ సినిమాలో కామెడీ చాలా తక్కువగానే ఉందని చెప్పాలి.
వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ని ఏజెంట్గా ఊహించుకొని కధ రాసుకున్నాడు దర్శకుడు.కానీ దానిని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు.కథ కథనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు.ఫస్ట్ ఆఫ్ లో ఏం జరుగుతుందో అర్థం కాకుండానే సెకండ్ హాఫ్ కి వస్తాము, అక్కడైనా నవ్వుకుందాము అన్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్ష పెట్టాడు డైరెక్టర్.
సైమన్ కే కింగ్ ఇచ్చిన బిజిఎం మాత్రం అద్భుతంగా ఉంది.కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది.
రేటింగ్: 3/5