మునుగోడులో మారుతున్న కండువాలు

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఖుదాబక్ష్ పల్లి గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం తాజా మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాషాయ గూటికి చేరుకున్నారు.

బీజేపీలో చేరిన వారికి రాజ్ గోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఖుదాబక్ష్ పల్లి గ్రామానికి చెందిన వడ్డెర సంఘానికి సంబంధించిన 20 కుటుంబాలకు చెందిన దాదాపు 60 మంది మరియు అదే గ్రామానికి చెందిన కొందరు పెద్దలు,యువకులు,పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఖుదాబక్ష్ పల్లి ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్ గౌడ్,మాతంగి నవీన్,రామదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Changing Scarves In The Front-మునుగోడులో మారుతు�
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Latest Nalgonda News