చంద్రయాన్ 3 లో కీలక పాత్ర పోషించిన తెలుగు మహిళ కల్పన.. ఆ టెన్షన్ పడ్డానంటూ?

మన దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3( Chandrayaan-3 ) ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై అడుగుపెట్టింది.అందులోని రోవర్ బయటకు వచ్చి సక్సెస్ ఫుల్ గా తన అధ్యయనాన్ని ప్రారంభించింది.

 Chandrayaan 3 Associate Project Director Kalpana K Success Story Details, Chandr-TeluguStop.com

ల్యాండర్ లో పంపిన రోవర్ పేరు ప్రగ్యాన్( Pragyan Rover ) కాగా దీని బరువు 26 కిలోలు కావడం గమనార్హం.ఇందులో రెండు పేలోడ్ లు ఉండగా ప్రస్తుతం రోవర్ తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది.

రోవర్ ఆరు చక్రాల సహాయంతో చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పని చేస్తుంది.

చంద్రయాన్ 3 సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వాళ్లలో కల్పన( Kalpana ) ఒకరు కాగా ఆమె చంద్రయాన్3 కు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేశారు.తెలుగు మహిళల సత్తా చాటిన కల్పనా కాళహస్తి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.చంద్రయాన్3 విషయంలో చాలా టెన్షన్ పడ్డామని చంద్రయాన్ 3 కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పని చేశామని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Chandrayaan, Chittoor, Isro, Isroscientist, Isrotelugu, Kalpana Isro-Gene

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని( Chittoor District ) తడుకు నా స్వస్థలం అని తండ్రి చెన్నై హైకోర్టులో పని చేసి రిటైర్ అయ్యారని ఆమె తెలిపారు.తాను చెన్నైలోనే చదువుకున్నానని మద్రాస్ యూనివర్సిటీలో బీటెక్ లో ఈసీఈ చదివానని తెలిపారు.ఇస్రోలో( ISRO ) పని చేయాలనేది చిన్నప్పటి కల కాగా బీటెక్ పూర్తైన వెంటనే ఆ దిశగా అడుగులు వేశానని ఆమె తెలిపారు.2000 సంవత్సరంలో ఇస్రోలో ఇంజినీర్ గా ఎంపికయ్యానని ఆమె కామెంట్ చేశారు.

Telugu Chandrayaan, Chittoor, Isro, Isroscientist, Isrotelugu, Kalpana Isro-Gene

ప్రస్తుతం నేను అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ( Associate Project Director ) పని చేస్తున్నానని కల్పన పేర్కొన్నారు.ఈరోజు ఉండే సవాల్ మరుసటి రోజు ఉండేది కాదని ప్రతిరోజూ కొత్త సవాల్ ఉంటుందని ఆ సవాల్ కు పరిష్కారం కోసం అంకిత భావంతో పని చేయాలని కల్పన కామెంట్లు చేశారు.ఒక్కోసారి 14 గంటల పాటు పని చేసిన రోజులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube