ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ( Andrapradesh ) లో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది.టిడిపి అగ్రనేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
దీంతో చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కు జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారు.అంతేకాకుండా ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
చంద్రబాబు ఫ్యామిలి కి భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ టిడిపి శ్రేణులకు కూడా భరోసా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్.ఇదంతా చూస్తే మాత్రం రాబోవు ఎన్నికల్లో తప్పనిసరిగా జనసేన టిడిపి పొత్తు తప్పదనిపిస్తోంది.
మరి చంద్రబాబుతో జనసేన ( Janasena ) పొత్తు ఎవరికి కలిసి వస్తుంది.అనేది ఇప్పుడు చూద్దాం.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓ మోస్తారు సీట్లు సాధించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి శాయశక్తుల కృషి చేస్తున్నారు.
ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుకోవడానికి సుముఖత చూపించారు.
టిడిపి ( TDP ) తో పొత్తు వల్ల జనసేన పార్టీకి ఎక్కువగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు హీరో పరంగానే ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ అది ఓట్ల వరకు వచ్చేసరికి కాస్త మైనస్ అవుతుంది.కాబట్టి టిడిపితో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్నో కొన్ని సీట్లు కేటాయించాలి.
ఆ కేటాయించిన సీట్లలో తప్పనిసరిగా టిడిపి శ్రేణులు సపోర్ట్ అందించాలి .అలా టిడిపి సంబంధించిన ఓట్లు మరియు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) కున్న ఇమేజ్ ఓట్లు ఆడ్ అయితే ఆ నియోజకవర్గాల్లో గెలుపు తీరాలకు వెళ్లవచ్చు.దీనివల్ల జనసేనకి రాబోవు ఎన్నికల్లో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.అంతేకాకుండా జనసేన పార్టీకి రాబోవు ఎన్నికల్లో 35 నుంచి 40 సీట్ల వరకు పొత్తులో భాగంగా ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.