తాడేపల్లిగూడెంలో టీడీపీ.జనసేన పార్టీలు కలసి సంయుక్తంగా “జెండా”( Jenda ) పేరిట సభక నిర్వహించారు.
ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున రెండు పార్టీల కార్యకర్తల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.
తాడేపల్లిగూడెం( Tadepalligudem ) సభ చూస్తే.తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అని అన్నారు.
ఈ సభా స్పందన శుభ సూచకం.త్వరలో రాష్ట్రానికి నవోదయం.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ నేను చేతులు కలిపాం.ఇది జనం కోరుకున్న పొత్తు.
నాడు విభజనతో ఆంధ్ర నష్టపోయింది.ఆ సమయంలో అధికారంలోకి వచ్చి అమరావతి, పోలవరం నిర్మాణం చేపట్టాం.
కష్టపడి పెట్టుబడులు తెచ్చి ఏపి అభివృద్ధి చేసుకుంటుంటే వైసీపీ( YCP ) ప్రభుత్వం వచ్చి అంతా నాశనం చేసింది.అని చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టానికి.ఈ రాష్ట్రంలో సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకోలేను.అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే.తత్వం ఉన్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా.మౌనంగా ఉండలేదు.ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.
మా పార్టీలు అధికారంలోకి రావడానికి కాదు.రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసి ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాం.
గతాన్ని నెమరు వేసుకుని భవిష్యత్తుకి నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.ఆ నాడు హేతుబద్ధత లేకుండా విభజన జరిగింది.
రాష్ట్రం ఎంతో నష్టపోయింది.ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన మేము.
ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశాం.ఢిల్లీకి( Delhi ) రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్లాం.
ప్రపంచ పర్యటనలు చేపట్టిన ప్రతిసారి ఎన్నో పెట్టుబడులు తీసుకురావడానికి యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేశాం.అంటూ తాడేపల్లిగూడెం సభలో.
చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు.