Tadepalli Palace : తాడేపల్లి ప్యాలెస్ వణుకుతుంది తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తాడేపల్లిగూడెంలో టీడీపీ.జనసేన పార్టీలు కలసి సంయుక్తంగా "జెండా"( Jenda ) పేరిట సభక నిర్వహించారు.
ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున రెండు పార్టీల కార్యకర్తల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.తాడేపల్లిగూడెం( Tadepalligudem ) సభ చూస్తే.
తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అని అన్నారు.ఈ సభా స్పందన శుభ సూచకం.
త్వరలో రాష్ట్రానికి నవోదయం.రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ నేను చేతులు కలిపాం.
ఇది జనం కోరుకున్న పొత్తు.నాడు విభజనతో ఆంధ్ర నష్టపోయింది.
ఆ సమయంలో అధికారంలోకి వచ్చి అమరావతి, పోలవరం నిర్మాణం చేపట్టాం.కష్టపడి పెట్టుబడులు తెచ్చి ఏపి అభివృద్ధి చేసుకుంటుంటే వైసీపీ( YCP ) ప్రభుత్వం వచ్చి అంతా నాశనం చేసింది.
అని చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. """/" /
ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టానికి.
ఈ రాష్ట్రంలో సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకోలేను.అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే.
తత్వం ఉన్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా.మౌనంగా ఉండలేదు.
ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.మా పార్టీలు అధికారంలోకి రావడానికి కాదు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసి ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాం.గతాన్ని నెమరు వేసుకుని భవిష్యత్తుకి నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
ఆ నాడు హేతుబద్ధత లేకుండా విభజన జరిగింది.రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన మేము.ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశాం.
ఢిల్లీకి( Delhi ) రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్లాం.ప్రపంచ పర్యటనలు చేపట్టిన ప్రతిసారి ఎన్నో పెట్టుబడులు తీసుకురావడానికి యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేశాం.
అంటూ తాడేపల్లిగూడెం సభలో.చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు.
విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు ఇవేనా..?