తెలంగాణలో మళ్ళీ బాబు పాగా..ముహూర్తం ఫిక్స్   Chandrababu Naidu To Improve TDP Situation In Telangana     2018-01-20   04:42:53  IST  Bhanu C

రాష్ట్ర విభజన జరగక ముందు చంద్రబాబు తెలుగు రాష్ట్రంలో చక్రం తిప్పారు..అయితే విభజన తరువాత తెలంగాణా సెంటిమెంట్ ముందు టిడిపి మాత్రం నిలువలేకపోయింది. తెలంగాణలో 15 సీట్లు సాధించిన టిడిపి తరువాత జరిగిన పరిణామాల వలన టిడిపి గుర్తుతో నెగ్గిన వాళ్ళు అందరు టీఆర్ఎస్ కారు ఎక్కేసారు..దీంతో తెలంగాణలో టిడిపి బాగా వీక్ అయ్యింది..మోత్కుపల్లి లాంటి వాళ్ళు చివరి వరకూ ఉండి వారి మరీ తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం సంచలనం కలిగించాయి..టిడిపిని టీఆర్ఎస్ లో కలిపెడ్డం అని అనడంతో ఒక్కసారిగా బాబు ఉలిక్కి పడ్డారు

అయితే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే మాత్రం అదే గతి అని ఆలోచించిన బాబు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు..తెలంగాణలో టిడిపిని గాడిలో పెట్టేందుకు అక్కడ బాబు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు.. గత ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి పార్టీ తరుపున పోటీ చేసి తరువాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన వారి స్థానాలలో ఇప్పుడు కొత్త నాయకులని పోటీ చేయించాలని యోచిస్తోంది తెలుగుదేశం పార్టీ..అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన నాయకులకి ఘలక్ ఇచ్చేలా బాబు ఈ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు..

ఇదిలా ఉంటే అసలు తెలంగాణలో కేడర్ లేని పార్టీ కి ఎందుకు ఇంత హడావిడి అని చాలా మంది భావిస్తున్నారు కానీ టిడిపి నమ్మేది మాత్రం ఒక్కటే కేడర్ లేకపోయినా సరే టిడిపి పై అభిమానం మాత్రం అందరికీ ఉంది..పైగా ఏపీ వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు…అంతేకాదు చంద్రబాబు ఆలోచన చేసేది ఒక్కటే టిడిపి ఎక్కువ సీట్లు గెలవకపోయినా సరే కేసీఆర్ కి గట్టి పోటీ ఇస్తే చాలు అనేది బాబు అభిప్రాయంగా కనిపిస్తోంది..అయితే ఇప్పటికే పల్లె పల్లె కి టిడిపి అనే కార్యక్రమాన్ని త్వరలోనే టిడిపి తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతోంది..సో చంద్రబాబు ఎలా అయినా సరే తన తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారు.