బాబు మళ్లీ ఆ తప్పు చేయరట ! 

టిడిపి అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా పార్టీకి మేలు చేసే విధంగానే ఉంటుందనే నమ్మకం తెలుగు తమ్ముళ్లలో ఉంటూ వచ్చింది.అయితే గత కొంతకాలంగా బాబు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పార్టీ జనాల్లో చులకన అవుతోంది అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఎక్కువవుతోంది.

 Chandrababu, Jagan, Ysrcp, Ap Cm Jagan, Lokesh, Elections, Mincipal Elections, B-TeluguStop.com

అధినేత నిర్ణయాలపై చాలా కాలంగా పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు.పార్టీ అన్న తర్వాత ఎన్నికల్లో గెలుపోటములు సహజం.

గెలుపు తర్వాత సంగతి, ముందు పోటీ చేసి తీరాలని తెలుగు తమ్ముళ్లు కసితో ఉన్నారు.కానీ చంద్రబాబు ఎందుకో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత నుంచి ఎన్నికలంటేనే భయపడుతున్నారని, ఏదో ఒక కారణం చెప్పి పోటీనుంచి తప్పు కుంటూ, తెలుగు తమ్ముళ్ల లో ఉన్న ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నారనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండడం పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేసి ఓటమి చెందడంతో ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు దీనికి కారణాలు చెప్పుకొచ్చారు.వైసిపి ప్రభుత్వం వేధింపుల వల్లే తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బాబు ప్రకటించడం తో అప్పటి వరకు ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు.

ఇక బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి టిడిపి అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరుని ఎప్పుడో ప్రకటించారు ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన తర్వాత ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని సెంటిమెంట్ ను తాము గౌరవిస్తున్నామని అంటూ బాబు ప్రకటన చేశారు.

Telugu Ap Cm Jagan, Apsh, Badvel, Chandrababu, Jagan, Lokesh, Mincipal, Ysrcp-Te

ఈ విషయంలోనూ టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే బాబు ఈ విధంగా యూటర్న్ తీసుకోవడానికి కారణం మాత్రం నిధుల కొరతట.ఎన్నికల్లో పోటీ చేసినా,  వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, అనవసరంగా అభ్యర్థులను బరిలోకి దింపి పరువు పోగొట్టుకోవడం తో పాటు, పార్టీ నిధులను వృధా చేయడం ఎందుకు అనే అభిప్రాయంతో వెనక్కి తగ్గి పోయారట.

అయితే పార్టీ అన్న తర్వాత ఓటమి కి భయపడి ఎన్నికల్లో పోటీ కి దూరంగా ఉంటే ఆ ప్రభావం తీవ్రంగా  ఉంటుంది అని , ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు పోటీకి దూరం అవడం వల్ల జనాల్లో చులకన అవుతాము అని కొంతమంది పార్టీ సీనియర్లు సూచించడంతో బాబు కూడా ఆలోచనలో పడ్డాడట.

త్వరలోనే శ్రీకాకుళం,  రాజమండ్రి,  నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.

దీంతో ఈ ఎన్నికల విషయంలో బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ పార్టీలో మొదలైంది.అయితే ఈ మూడు ప్రాంతాల్లోనూ టిడిపి బలంగా ఉండడం తో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నారట .జనసేన మద్దతు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానూ ఉంటుంది కాబట్టి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయంలో ఉన్నారట.ఎన్నికలను బహిష్కరించడం పోటీకి దూరంగా ఉండడం వంటి వ్యూహాత్మక తప్పిదాలను మళ్ళీ చేయకూడదనే అభిప్రాయంలో బాబు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube