సుశాంత్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ముంబయి వర్గాల వారు అంటున్నారు.ఇప్పటికే కేసును ముంబయి పోలీసులు సీబీఐకి అప్పగించడంతో పాటు ఫార్మాల్టీస్ అన్ని కూడా పూర్తి అయ్యాయి.
దాంతో సీబీఐ వారు రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటికే పలువురిని ముంబయి పోలీసులు ప్రశ్నించిన విషయం తెల్సిందే.
అయినా కూడా మళ్లీ వారందని కూడా తమదైన శైలిలో విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోంది.ఇప్పటికే ఎవరిని ఈ కేసులో ప్రశ్నించాలి అనే విషయంలో ఒక జాబితాను కూడా సిద్దం చేశారట.
ఆ జాబితాలో ముందుగా రియా చక్రవర్తి మరియు సుశాంత్ ఇంట్లో పని చేస్తున్న కొందరిని కూడా ప్రశ్నించబోతున్నారు.సుశాంత్ కేసులో కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాంతో వారిని మొదట ప్రశ్నించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మరో వైపు గత కొన్ని రోజులుగా కంగనా రనౌత్ ఈ విషయంలో ఆరోపణలు చేస్తోంది.
తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటోంది.కనుక ఆమెను కూడా సీబీఐ వారు ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వంకు ఏమాత్రం సంబంధం లేకుండా ఈ కేసును సీబీఐ విచారించనుంది.ఈ సమయంలోనే కొందరు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.అయితే రియా చక్రవర్తిని అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఆమెను ప్రశ్నించే అవకాశం మాత్రం ఉందంటున్నారు.ఆ సమయంలో వారికి ఏమైనా అనుమానం కలిగి కేసులో కీలకంగా అనిపిస్తే మాత్రం అప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.