మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇంట్లో చోరీ

నల్లగొండ జిల్లా: ఎవరూలేని ఇంట్లో దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరించిన ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోల్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కొప్పోల్ గ్రామానికి చెందిన మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఆవుల వెంకటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బందువుల ఇంటికి వెళ్ళాడు.

తిరిగి రాత్రి 10గంటలకు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగల గొట్టబడి ఉంది,లోపలికి వెళ్ళి చూస్తే బీరువ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న రూ.లక్ష 92000 నగదు, 4 తులాల బంగారం చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్ ని రప్పించి వేలి ముద్రలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Burglary At Former PACS Chairman House, Burglary ,former PACS Chairman House, Av

మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచడంతో పాటు,అనుమానాస్పదంగా ఎవరైనా కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మధు కోరారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News