తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు.పెద్దగా జనాల్లోకి రావడం లేదు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.మరోవైపు చూస్తే లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) సమయం దగ్గర పడింది.
ఈ నేపథ్యం లో బిజెపి, కాంగ్రెస్ లపై పై చేయి సాధించేందుకు బీఆర్ఎస్ కూడా భారీగానే ప్లాన్ లు వేస్తోంది. అయితే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగకపోవడం వంటివి ఆ పార్టీ నాయకుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
కేసిఆర్ జనాల్లోకి రాకపోవడం తో పార్టీ నాయకులూ ఉసూరుమంటున్నారు.

జనాల్లోనూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న అనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఫిబ్రవరి నెలలో జనాల్లోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటనలు ఉండబోతున్నాయట .ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు( KCR Birthday ) వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు .అదే రోజున కేసీఆర్ తెలంగాణ భవన్ కు ( Telangana Bhavan ) రానున్నట్లు సమాచారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు.

అక్కడ కాలుజారి కింద పడడంతో తుంటి ఎముక విరిగి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు.ఆ తర్వాత నంది నగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ అన్ని కారణాలతో పార్టీ కార్యక్రమాలకు, ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారు.మొత్తం పార్టీ వ్యవహారాలన్ని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) చూసుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కూడా ఆయనకే కేసీఆర్ అప్పగించారు.ఎప్పుడైతే కెసిఆర్ సూచనలతో అన్ని లోక్ సభ నియోజకవర్గల్లోనూ కేటీఆర్ పర్యటిస్తూ , సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ శ్రేణులకు తగిన సూచనలు చేస్తున్నారు.
ఇక వచ్చే నెల నుంచి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు.