బ్రేకింగ్: తెలంగాణ ఎన్నికల బరిలో ‘జనసేన’

Breaking: 'Jana Sena' In Telangana Election Ring

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన నిలువనుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.జగిత్యాల జిల్లా కొండగట్టులో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 Breaking: 'jana Sena' In Telangana Election Ring-TeluguStop.com

తెలంగాణలో 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు.ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

ఏపీలో, తెలంగాణలో సమస్యలు వేరు వేరని పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణలో త్వరలోనే పర్యటిస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకున్నామన్నారు.రాష్ట్రంలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేస్తామన్న పవన్ తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో తాను లేనని వెల్లడించారు.

రాజకీయ కారణాలతోనే ఏపీలో వారాహికి అనుమతి ఇవ్వలేదని పవన్ తెలిపారు.జనసేనకు బీజేపీ ఎప్పుడూ దోస్తేనని పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube