కనిపించిన అందరికి బ్రేక్ అప్ చెబుతున్న విజయ్ దేవరకొండ  

బ్రేక్ అప్ టైటిల్ తో వస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ. .

Break Up Is A Vijay Devarakonda Next Movie Title-kranthi Madhav,telugu Cinema,tollywood,vijay Devarakonda Next Movie Title

టాలీవుడ్ లో అతి తక్కువ టైంలో స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. కెరియర్ లో నాలుగు హిట్స్ తో 50 కోట్ల హీరోగా మారిపోయిన విజయ్ తో సినిమాలు తీసేందుకు కుర్ర దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు నిర్మాతలు కూడా విజయ్ ని కాష్ మిషన్ గా చూస్తున్నారు. దీంతో అతని మీద పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు..

కనిపించిన అందరికి బ్రేక్ అప్ చెబుతున్న విజయ్ దేవరకొండ-Break Up Is A Vijay Devarakonda Next Movie Title

ఇదిలా ఉంటే ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టొరీతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రేమించిన ప్రతి అమ్మాయితో బ్రేక్ అప్ అయిపోతూ ఉంటుందని, లవ్ లో ఎక్కువ సార్లు ప్రియురాళ్ళతో బ్రేక్ అప్ చెప్పుకున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ కారణంగా సినిమాకి కూడా బ్రేక్ అప్ అనే టైటిల్ ని పెట్టాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ టైటిల్ ట్రెండ్ కి కూడా భాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.