బిజెపి అంటే ఏపీలో బాబు జనతా పార్టీ: మంత్రి రోజా!

అమరావతి నిర్మాణాల సబ్ కాంట్రాక్ట లలో అవినీతిపై ఐటీ శాఖ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు( Chandrababu ) ఇచ్చిన నోటీసుల వ్యవహారం పై మంత్రి రోజా స్పందించారు.త్వరలోనే ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ,అందుకే తన అరెస్టు చేస్తారంటూ సింపతీ కార్డు ప్లే చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ,ఇది ఆయనకు అలవాటే అంటూ రోజా చెప్పుకొచ్చారు.2019లో కూడా మోడీ( Modi ) తన అరెస్టు చేస్తారని సంపతి పొందడానికి ప్రయత్నించారని, అలిపిరిలో బాంబుదాడి జరిగినప్పుడే చంద్రబాబు పై సింపతి ప్రజలకు ఏర్పడలేదని ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు.తన ప్రతి చర్యను తన రాజకీయానికి అనుకూలంగా మార్చుకోవడంలో బాబు సిద్ధహస్తుడని, పరిణామాలు అడ్డం తిరిగితే విజయ్ మాల్యాలా విదేశాలకు కూడా పారిపోయే ఏర్పాట్లు చేసుకుంటాడు అంటూ ఆమె విమర్శించారు.

 Bjp Means Babu Janata Party In Ap Minister Roja , Chandrababu, Minister Roja,-TeluguStop.com
Telugu Chandrababu, Roja, Modi, Pawan Kalyan, Purandeshwari-Telugu Political New

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన స్వంత జిల్లా చిత్తూరుకు ఏం చేశారని తాను అధికారంలో ఉండగానే ఎస్వి షుగర్ ఫ్యాక్టరీని ( SV Sugar Factory )మూయించారని దానికి ఉన్న 20 కోట్ల రూపాయలకు పైగా బిల్లులను సెటిల్ చేసి ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని చంద్రబాబు రాజకీయ అనుభవం వల్ల చిత్తూరు జిల్లాకుఒరిగింది శూన్యం అంటూ ఆమె విమర్శించారు.అమరావతిని అవనితి రాజధానిగా మార్చారని సి ఆర్ డి ఏ అంటే “చంద్రబాబు రియల్ దోపిడీ “అన్నట్టుగా మార్చేశారని, తెల్లవారితే అధికారపక్షంపై దాడి చేసే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కానీ బీజేపీ నేత పురందేశ్వరి గానీ ఈ అవినీతి ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని మంత్రి రోజా వాఖ్యనించారు.

Telugu Chandrababu, Roja, Modi, Pawan Kalyan, Purandeshwari-Telugu Political New

పురందేశ్వరి బిజెపి అధ్యక్షురాలు అయిన తర్వాత బిజెపి ( BJP )బాబు జనతా పార్టీలా మారిపోయిందని, ఈ విషయంలో ఆమె మరిదిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ రోజా వాఖ్యనించారు .అమరావతి నిర్మాణాల తాలూకు సబ్ కాంట్రాక్ట్ లలో అవినీతి జరిగిందంటూ ఐటి శాఖను ఇచ్చిన నోటిస్ పై తెలుగుదేశం వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది .దాంతో అధికార పార్టీ ఈ వ్యవహారంలో తిరుగుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మంత్రులు వ్యవహారశైలి ని బట్టి అర్థమవుతుంది.ఒకరి తర్వాత ఒకరు అధికారపక్షం తో పాటు దాని ఇతర రాజకీయ పక్షాలయిన జనసేన, బిజెపిలపై కూడా తీవ్ర స్థాయిలో గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube