హాట్ డిబేట్ గా మారిన పాలేరు!

ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ రాజకీయ పార్టీలు మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా అనేక వ్యూహాలను మారుస్తున్నాయి.కొన్ని సీట్లకు రెబల్ అభ్యర్థులతో పాటు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థులు( MLA Candidates ) పోటీ పడడంతో బలా బలాలను సామాజిక సమీకరణాలను ,ఆర్థిక పరిస్థితులను క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.

 Who Will Be The King In Paleru , Paleru , Congress, Upender Reddy, Ysr Tp, Tumma-TeluguStop.com

అలా తెలంగాణలో ఇప్పుడు పార్టీలకు చాలెంజింగ్ గా మారిన నియోజకవర్గాలలో పాలేరు ఒకటి .ఈ సీటు అన్నీ ప్రదాన పార్టీలకు సవాలు విసురుతుంది .ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్ధి 2018 లో వొడిపోయినా కాంగ్రెస్( Congress ) నుంచి గెలిచి తమ పార్టీలో జాయిన్ అయిన ఉపేందర్ రెడ్డి( Upender Reddy ) కి ప్రాధాన్యత ఇచ్చి 2023 అసెంబ్లీ టికెట్ ను కేటాయించింది.దాంతో తమ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల ఇప్పుడు పార్టీని వీడే పరిస్థితుల్లో ఉన్నారు .బుజ్జగింపు చర్యలు చేపట్టినప్పటికీ ఒకపక్క అసంతృప్తి మరోపక్క అనుచరుల ఒత్తిడితో ఆయన కాంగ్రెస్ లోకి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telugu Congress, Cpm Veerbhadra, Paleru, Upender Reddy, Ysr Tp-Telugu Political

అయితే కాంగ్రెస్ లో కూడా ఈ సీటు కోసం తీవ్రమైన పోటీ నడుస్తుంది.కాంగ్రెస్లో విలీన ప్రక్రియ చివరి దశలో ఉన్న వైఎస్సార్ టిపి( YSR Tp ) అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) మొదటి నుంచి పాలేరు సీటుపై కర్చీఫ్ వేశారు .ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని ఘంటాపదం గా చెబుతున్నారు.దానికి తగ్గట్టే అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా ఆమె పాలేరు సీటు తనదేనంటూ ప్రకటించారు.విలీనం చివరి దశలో ఉన్నందున ఆమెకు పాలేరు సీటు దక్కిందో లేదో ఇంకా పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ రాలేదు.

ఇంతలో తుమ్మల వంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా పాలేరు సీటునే కోరుకుంటారు.మరి తుమ్మల( tummala ) రాకకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ వీరిద్దరిలో ఎవరికి ఈ సీటు కేటాయిస్తుందన్నది అంతు పట్టని ప్రశ్నగా మారింది .

Telugu Congress, Cpm Veerbhadra, Paleru, Upender Reddy, Ysr Tp-Telugu Political

అంతేకాకుండా కాంగ్రెస్తో కలిసి నడవాలని భావిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా పాలేరు సీటుపై ఆశపడుతున్నట్లుగా తెలుస్తుంది.తమకు బలమైన నియోజకవర్గాల్లో పాలేరు కూడా ఒకటని సిపిఎం నేత వీరభద్రం( CPM leader Veerbhadra ) చెబుతున్నారట.ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ గెలిచేది, నిలిచేది తానేనని గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్న నన్ను వాళ్లే గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు .అసలు గోదావరి జలాలకు తుమ్మల రాజకీయానికి సంబంధం లేదని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన నిజంగానే అంత స్థాయి నేత అయితే 2018 లో ఎందుకు ఓడిపోయారంటూ ఉపేందర్ రెడ్డి లాజిక్కులు లాగుతున్నారు.ఏది ఏమైనాప్పటికీ ఆశావహులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube