బిగ్ బాస్( Bigg Boss )తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో అశ్విని( Ashwini ) ఒకరు.ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇలా బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక గత రెండు వారాలుగా ఈమె తన ఆటతీరుతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అదేవిధంగా పాటబిడ్డగా హౌస్ లోకి వెళ్లినటువంటి భోలేతో ఈమెకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న అశ్విని గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు పలు సినిమాలలో కూడా నటించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా( Sarileru Neekevvaru )లో రష్మిక అక్క పాత్రలో నటించారు.అదేవిధంగా రాజా ది గ్రేట్ సినిమా( Raja The Great )లో కూడా ఈమె ఒక పాత్రలో సందడి చేశారు.
సినిమాలలో కొనసాగుతూ అనంతరం ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.వృత్తి పరమైన జీవితం గురించి ఇలా ఉన్నప్పటికీ ఈమె వ్యక్తిగత విషయం గురించి తాజాగా ఒక వార్త సంచలనగా మారింది.
వరంగల్ నిట్ కాలేజీలో బీటెక్ పూర్తి చేస్తున్నటువంటి ఈమె నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు ఇలా హీరోయిన్ గా ఈమె ప్రయత్నాలు చేసిన హీరోయిన్గా అవకాశాలు రాకపోయినప్పటికీ ఆ సినిమాలలో అవకాశాలు అందుకొని నటిస్తున్నారు.ఇక ఈమె హీరోయిన్ కటౌట్ కి ఏ మాత్రం తీసుపోదనే విషయం కూడా తెలిసిందే.అయితే హీరోయిన్ గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోతున్నారు.ఇదిలా ఉండగా ఈమెకు 2013 వ సంవత్సరంలోనే వివాహం ( Ashwini Marriage ) జరిగింది అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నటువంటి అశ్విని కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయారట ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తుంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అందరిని కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది