మునుగోడులో టీఆర్ఎస్ కు భారీ షాక్

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

పార్టీ సీనియర్ నేత,చండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతాశ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య మరి కొంతమంది నాయకులు,కార్యకర్తలు మంగళవారం కారు దిగి కమలం గూటికి చేరారు.

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరడంతో గులాబీ గూటికి మునుగోడు నియోజకవర్గ పరిధిలో గట్టి ఎదురుదెబ్బగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Nalgonda News