పంజాబ్ లో 60 మంది విద్యార్థినీల బాత్రూం వీడియోలు లీకైన ఘటన కలకలం సృష్టిస్తుంది.చండీగఢ్ యూనివర్సిటీలో ఈ దారుణం చోటు చేసుకుంది.
విద్యార్థినులు హాస్టల్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఓ అమ్మాయి వీడియోలు తీసింది.అనంతరం వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించింది.
దీంతో అతడు వర్సిటీ అమ్మాయిల వీడియోలను వెబ్ సైట్లో అప్లోడ్ చేశాడు.విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినీలు ఆందోళనకు దిగారు.
తమ వీడియోలు లీక్ అయ్యాయనే మనస్థాపంతో ఎనిమిది మంది విద్యార్థినీలు పైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.







