ఈమద్య కాలంలో ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు వరుసగా వస్తున్నాయి.జీ5 ఓటీటీ లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ మూవీ బట్టల రామస్వామి బయోపిక్.ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో అల్తాఫ్ హసన్ హీరోగా నటించగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు.అల్తాఫ్ హసన్ కు శాంతి రావు.
లావణ్య రెడ్డి.సాత్విక జాయ్ లు నటించారు.
ఒక సామాన్య బట్టల వ్యాపారి పెళ్లిపై ఆసక్తి లేకుండా జీవనం సాగిస్తున్న సమయంలో అనూహ్యంగా ఒక జయప్రదను చూసి ప్రేమలో పడతాడు.అది కూడా తండ్రి శవాన్ని అంత్యక్రియలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆమెతో ప్రేమలో పడతాడు.
ప్రేమించిన ఆమెను దక్కించుకునేందుకు అతడు పడే కష్టాలు కూడా చాలా ఫన్నీగా చూపించారు.
జయప్రదతో హాయిగా జీవితాన్ని సాగిస్తున్న బట్టల రామస్వామి జీవితంలోకి మరో భార్యగా సుధ వస్తుంది.
జయప్రద చెల్లి సుధ
.మానసిక వికలాంగురాలైన సుధ ను ఎవరు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో తన భర్తకే చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని జయప్రధ భావించి రామస్వామిని ఒప్పిస్తుంది.ఇష్టం లేకుండానే మరదలును రెండవ వివాహం చేసుకుంటాడు.సరే ఇద్దరితో సంసారం సాగిద్దం అనుకున్న రామస్వామికి మూడవ భార్య గా సిరి వస్తుంది.సిరి తల్లి నాటకం ఆడి ఆయన వద్ద ఉన్న చీరలను లాగేసుకోవాలని ప్రయత్నిస్తే చివరకు సిరిని రామస్వామి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అలా ముగ్గురిని పెళ్లి చేసుకున్న రామస్వామి పడ్డ బాధలు ఫన్నీగా చూపించారు.
ముఖ్యంగా జయప్రద మరియు సిరిల మద్య గొడవలు సినిమా స్థాయిని పెంచేశాయి అనడంలో సందేహం లేదు.మొత్తంగా జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న బట్టల రామస్వామి బయోపిక్ మూవీ భలే ఉందే అన్నట్లుగా టాక్ దక్కించుకుంది.