తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కే.
రోజా.కార్యకర్త స్థాయి నుండి మంత్రి వరకు స్వశక్తి తో ఎదిగింది రోజా.
ప్రత్యర్థులను బలమైన పంచులతో టార్గెట్ చేసే రోజా అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లు ఉండరు.టీడీపీ పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వైసీపీ లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
తాజాగా పర్యాటక శాఖ మంత్రి పదవి ఆమెను వరించింది.ఇదిలా ఉంటే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజాపై సంచలన కామెంట్లు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే హల్ చల్ అవుతుంది.మంత్రిగా ఎన్నికైన రోజను పొగడ్తలతో ముంచెత్తాడు.రోజా కూడా సినిమా ఇండస్ర్టీ నుండి వచ్చి రాజకీయాల్లో సక్సస్ అయింది.దీంతో బండ్ల గణేష్ రోజాకు సినిమా ఇండస్ర్టీ నుండి సన్మానం చేయాలని కోరారు.
సీరియల్స్, సినిమాలు, రాజకీయాల్లో రాణించి మంత్రిగా ఏదగడం వెనుక ఆమె కష్టమే దాగి ఉందన్నారు.ఆమెకు మంత్రి పదవి రావడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బండ్ల గణేష్ అన్నారు.
రోజాను సన్మానించడానికి చిత్ర పరిశ్రమ పెద్దలంతా ముందుకు రావాలన్నారు.రోజాకు మంత్రి పదవి ఇచ్చిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో తను కాంగ్రెస్ పార్టీ లో వున్నానని టీఆర్ఎస్ పార్టీలో రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకు మంచి స్నేహితులు అని బండ్ల అన్నారు.రాజకీయాలకు, స్నేహాలకు సంబంధం లేదన్నారు.
ఏపీ లో రాజకీయాలు కేటీఆర్ మాట్లాడితే వైసీపీ వాళ్లు భుజాలు తడుముకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఇక హైదారాబాద్ లో కరెంట్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారని ఆ విషయం గురించి నన్ను అడగొద్దని కోరారు.బొత్స తో పాటు, పవన్ కళ్యాణ్ పై కూడా నేను ఎలాంటి కామెంట్లు చేయను అని అన్నారు.పవన్ కళ్యాణ్ ను సీఏం గా చూడాలన్నదే నా చిరకాల స్వప్నం అని ఆయన అన్నారు.
ఇలా దాదాపు రెండు గంటల పాటు బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు అన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.