ముద్దొస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ వైరల్ పోస్ట్!?

సినీ ప్రేక్షకులకు నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

 Bandla Ganesh About Pawan Kalyan Hhvm Look, Bandla Ganesh, Tollywood, Pawan Kaly-TeluguStop.com

కాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ ని దేవుడులా భావిస్తూ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటి చెబుతూ ఉంటాడు.

అంతేకాకుండా పవన్ పై ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ చేసిన ఎవరైనా విమర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలను సైతం గుప్పిస్తూ ఉంటాడు బండ్ల గణేష్.

 Bandla Ganesh About Pawan Kalyan Hhvm Look, Bandla Ganesh, Tollywood, Pawan Kaly-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రీట్ చేస్తూ ఉంటారు మన బండ్లన్న.

ఈ నేపథ్యంలోనే తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ ని చేశారు.ఆ పోస్టులో హరిహర వీరమల్లు సినిమా నవరాత్రుల సందర్భంగా ఆ సినిమా వర్క్ షాప్ కు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు బండ్ల గణేష్.

ఇక ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ కాస్త హ్యాండ్సమ్ గా కనిపించారు.ఇక ఆ ఫోటోలను షేర్ చేసిన బండ్ల గణేష్.అబ్బబ్బ మా బాస్ ని చూస్తుంటే గుండెల్లో దడ మొదలైంది.రక్తం ఉరకలేస్తుంది.

ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే 1000 కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తాను.అబ్బా ముద్దొస్తున్నావ్ బాస్ అని రాసుకొచ్చాడు బండ్ల గణేష్.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దర్శకుడు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ రెండవ వారంలో మొదలుకానుంది.ఎం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మొగల్ సామ్రాజ్యానికి చెందిన కథతో రూపొందనుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొగల్ రాజ్యం నుంచి కోహినూర్ వజ్రాలు దొంగలించే ఒక వ్యక్తిగా కనిపించబోతున్నట్లుగా సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube