ఈనెల 26న నల్లగొండకు బండి సంజయ్ రాక...!

నల్లగొండ జిల్లా: బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఈ నెల 26 న నల్లగొండలో జరిగే జిల్లా మహాజన్ సంపర్క్అభియాన్ సభలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుండి జూన్ 30 వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26 సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ నందు సుమారు పదివేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ సభకు బీజేపీ రాష్ట్ర,జిల్లా,మండల, పట్టణ,వివిధ మోర్చాల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ కమిటీ సభ్యులు,యువకులు, విద్యార్థులు,మేధావులు, కవులు,మహిళలు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జాతీయ నేత గోలి మసూదన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్,కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్,పార్లమెంట్ కన్వీనర్ బండార్ ప్రసాద్,ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య, పట్టణ అధ్యక్షులు మొరిశేట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

Latest Nalgonda News