కొన్ని కొన్ని సార్లు ఎంత తెలివి ఉన్నవాళ్లు కూడా మోసపోతూ ఉంటారు.నమ్మిన వ్యక్తులే వారిని గుడ్డిగా మోసం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు రష్మిక కూడా తన మేనేజర్ విషయంలో మోసపోయింది.అతనిని గుడ్డిగా నమ్మినందుకు అతడు రష్మికకు( Rashmika ) కోలుకోని దెబ్బ కొట్టాడు.
దీంతో కొందరు జనాలు రష్మికదే తప్పు అంటూ తనను ట్రోల్ చేస్తున్నారు.ఇంతకు అసలేం జరిగిందా ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అవకాశాలు అందుకుంటుంది.
ప్రస్తుతం పుష్ప టు సినిమాలో బిజీగా ఉంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్( Bollywood, Kollywood ) లో కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.
ఇక సినిమాలలోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్లలో కూడా అలరిస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ తో బాగా లైక్స్, కామెంట్స్ అందుకుంటుంది.
ఇక ఈమె ఇండస్ట్రీలో అల్లరి పిల్ల అనే ట్యాగ్ కూడా సొంతం చేసుకుంది.మీడియా కంటపడితే చాలు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు జనాలచే బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.

కొన్నిసార్లు తన ప్రవర్తన అతిగా ఉండటం వల్ల ఆమె పై పేరు రకరకాల నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోదు రష్మిక.అయితే ఇదంతా పక్కన పెడితే.
తాజాగా రష్మికకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా రష్మిక డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోదు.డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక అతి జాగ్రత్త వల్లే ఇప్పుడు దారుణంగా మోసపోయింది.ఏంటంటే తన బాధ్యతలు అన్ని చూసుకునే మేనేజర్ తనను మోసం చేసి రూ.80 లక్షలు కాజేశాడు.రష్మిక తన మేనేజర్ ను గుడ్డిగా నమ్మేసింది.
అతడు ఏది చెబితే అది ఫాలో అయ్యేది.దీంతో అతడు రష్మికను మోసం చేసి డబ్బులు తీసుకొని పరారయ్యాడు.

అతడు చాలా కాలం నుంచి రష్మిక దగ్గరే పనిచేస్తున్నాడు.అలా నమ్మకంగా పనిచేసిన ఆ వ్యక్తి రష్మికకు టోకరా వేశాడు.దీంతో రష్మిక అతడిని నమ్మి మోసపోయినందుకు ఇప్పుడు డిప్రెషన్ లో ఉందని తెలిసింది.అంతే కాకుండా కొత్త మేనేజర్ ను పెట్టుకుందని తెలిసింది.అయితే ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవ్వటంతో జనాలు ఆమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఎంత మేనేజర్ అయిన డబ్బు విషయంలో అంత లా ఫ్రీడం ఇవ్వద్దు అని.కనీసం నీ డబ్బు నువ్వు దాచుకునే అంత స్తోమత కూడా లేదా.ఇంత తెలివి తక్కువగా అంత డబ్బు అతనికి ఎలా అప్పజెప్పావు.
అంటే ఇలా నానా రకాలుగా ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.







