స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి( Chandrababu ) ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడం తెలిసిందే.దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ క్రమంలో ఏపీలో పార్టీ కార్యకలాపాలను చంద్రబాబు బామ్మర్ది ఎమ్మెల్యే బాలకృష్ణ చూసుకుంటూ ఉన్నారు.సోమవారం సాయంత్రం మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ( Balakrishna ) రావటం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.చంద్రబాబు జైల్లో ఉండటంతో పార్టీ పరంగా తదుపరి ఏం కార్యక్రమాలు చేయాలన్న దానిపై చర్చించడం జరిగింది.
బాలకృష్ణ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి సీనియర్ లు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు( Yanamala Ramakrishna , Kambhampati Rammohan Rao ) లతో పాటు పట్టాభి, నక్క ఆనందబాబు సహా పలువురు హాజరయ్యారు.చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ కార్యక్రమం…ఆందోళనలు, నిరసనలు ఎలా జరిగాయి వంటి విషయాలను నేతలను అడిగి తెలుసుకున్నారు.ఇదే సమయంలో బెయిల్ ఎప్పుడు వస్తుందో అన్నదానిపై కూడా బాలకృష్ణ నాయకులతో చర్చించినట్లు సమాచారం.ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం దూకుడుకి ఎలా కళ్లెం వేయాలి.రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్లాలి అన్నదానిపై కూడా నేతలతో చర్చించడం జరిగింది అంట.