దళితుణ్ణి చెప్పుతో కొట్టిన బాజకుంట సర్పంచ్ ను సస్పెండ్ చెయ్యాలి

నల్లగొండ జిల్లా:కలెక్టర్ తక్షణమే స్పందించి దళితుణ్ణి చెప్పుతో కొట్టిన బాజకుంట సర్పంచ్ ను సస్పెండ్ చెయ్యాలని,అదే విధంగా జిల్లా ఎస్పీ వెంటనే వారిపై ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పీఆర్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.

ఆదివారం ఉదయం నార్కెట్‌పల్లి మండలం బాజకుంట గ్రామంలో దళితులపై జరిగిన వరుస దాడుల ఘటనపై నల్లగొండ డిఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలనకు వెళ్ళిన సందర్భంగా బీఎస్పీ, ఎమ్మెస్పి,డిఎస్పీ నేతలతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు.

అనంతరం గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని,ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న అగ్రకుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో పోలీస్ అధికారులు ఎస్సీ,ఎస్టీ,అత్యాచార నిరోధక చట్టాలను చట్టబద్ధంగా అమలు చేసిననాడు ఈ సమస్యలు రావన్నారు.నిమ్న వర్గాలు ఎల్లప్పుడూ శాంతి కాముకులేనని,ఎక్కడ అరాచకం చేసే పనిలో ఉండరని,కానీ,వారిఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అగ్రకుల వ్యక్తులు దాడులు,దౌర్జన్యాలు చేస్తే చట్టాన్ని ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి శంకర్, బీఎస్పీ జిల్లా ఇంచార్జి ఆదిమళ్ళ గోవర్ధన్,డిఎస్పీ నాయకులు ప్రవీణ్, ఖమ్మంపాటి వెంకన్న గౌడ్,వంగాల లక్ష్మయ్య మరియు బాధితులు పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Advertisement

Latest Nalgonda News