నల్లగొండ జిల్లా:వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుండే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘటించారు.ఆదివారం నల్లగొండ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రోడ్ల వెడల్పు పేరుతో నాలుగు బొమ్మలు పెడితే అభివృద్ధి జరిగినట్లేనా? ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు.అభివృద్ధి గురించి మాట్లాడే గుత్తా సుఖేందర్ రెడ్డి 2004 లో ప్లై ఓవర్ నిర్మిస్తే తన దగ్గర పని చేస్తానని అన్నారని గుర్తు చేశారు.నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని, సహాయం అడిగితే గేటు బయట నుంచి తరిమేస్తున్నారని,ప్రజలందరూ నాకే ఫోన్ చేస్తూ సమస్యలు చెప్పుకుంటున్నారు.
ఇది చాలదా నల్లగొండ పరిస్థితి ఏమిటో తెల్వడానికన్నారు.ఎమ్మార్పీ కాలువ నీరు విడుదల చేయాలని అధికారులను కోరిన,రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు.నల్లగొండలో మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు అండగా ఉంటాను.వారిని నాలుగేళ్లు చదివించేందుకు ఆర్థికంగా నాదే భరోసా అని హామీ ఇచ్చారు.
కాకినాడ ప్రజలకు కూడా అండగా ఉంటున్న,అక్కడ కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరంట ఎన్నికల అప్పుడే కనపడతారంట,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలపాలని సజ్జల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.అట్లాంటి మాటలు మానుకోవాలి సజ్జలకు హితవు పలికారు.
బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న కేసీఆర్ తెలంగాణ పదాన్ని వదిలేయడం బాధేస్తుందన్నారు.పీసీసీ కమిటీలో నాకు ఏ పదవి అవసరం లేదని,మంత్రి పదవిని వదిలేసా,ఈ పదవి ఒక లెక్కా, అయినా నా మీద కాంగ్రెస్ కండువే ఉంది కదా?ఇది చాలదా అని అన్నారు.ఎన్నికలకు నెల రోజుల ముందే రాజకీయాలు మాట్లాడతానని చెప్పారు.నల్లగొండ ప్రాజెక్టుల విషయంలో ఎందుకు నిధులు విడుదల చేయట్లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.దళిత బంధు విషయంలో అధికార పార్టీ నేతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, పార్టీలో చేరితేనే ఇస్తామని అంటున్నారని,టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తూ,మిగతా వారిని వదిలేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని,దళిత బంధు అర్హులకు అందకుంటే,అందని వారితో ఆందోళన చేస్తామని హెచ్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.







